CBSE: రెండు విడతల్లో 10th పరీక్షలు 1 y ago
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విధానంలో 10వ తరగతి చదివే విద్యార్ధులు 2026 నుండి బోర్డు పరీక్షలను ఏడాదిలో రెండుసార్లు రాసే అవకాశాన్ని పొందనున్నారు. ఇందుకు సంబంధించిన ముసాయిదా నిబంధనలకు సీబీఎస్ఈ ఫిబ్రవరి 25న ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన పబ్లిక్ నోటీస్ను తన అధికారిక వెబ్సైట్లో ఉంచింది. వాటిపై ప్రజల అభిప్రాయాలు, సూచనలు, అభ్యంతరాలను మార్చి 9 వరకూ స్వీకరించనుంది. తదుపరి దానికి ఆమోద ముద్ర వేయనుంది. నూతన విధానం ప్రకారం విద్యార్ధులు కోరుకుంటే రెండు విడతల్లోనూ పరీక్షలకూ హాజరుకావచ్చు. తొలిదఫా పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి మార్చి వరకూ, రెండో దఫా మే 5 నుంచి 20 వరకూ నిర్వహిస్తారు.